కొయ్యలగూడెం: ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

1264చూసినవారు
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్థానిక నాయకులకు, అధికారులకు తెలియజేయాలని కోరారు. చెరువుల దగ్గరలో నివసించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.