కొయ్యలగూడెం సమీపంలో వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రైతులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, హుండీని కూడా పగులగొట్టి విలువైన సొత్తును అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.