గొడుగుపేటలో రూ. 1.08 కోట్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

2చూసినవారు
గొడుగుపేటలో రూ. 1.08 కోట్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
ద్వారకాతిరుమల మండలం, రామసింగవరం పంచాయతీ పరిధిలోని గొడుగుపేట గ్రామంలో రూ. 1 కోటి 8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేగంటి రాంబాబు, జనసేన మండల ప్రెసిడెంట్ దాకారపు నరసింహ మూర్తితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్