ముదినేపల్లి: బాలుడి ఆచూకీ కోసం మరింత లోతైన దర్యాప్తు

369చూసినవారు
ముదినేపల్లి: బాలుడి ఆచూకీ కోసం మరింత లోతైన దర్యాప్తు
ముదినేపల్లి మండలం శ్రీహరిపురం బీసీ కాలనీలో పదిరోజుల క్రితం అదృశ్యమైన రెండేళ్ల బాలుడు మోక్షిత్ ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు రూరల్ సీఐ రవికుమార్ తెలిపారు. గురువారం బాలుడి బంధువులను కలిసి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని లోతుగా పరిశీలించి అనుమానితులను గుర్తించాలని ఎస్సై వీరభద్రరావును ఆదేశించారు. బాలుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లోనూ గాలిస్తున్నట్లు సీఐ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్