తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన మండ్రాజు మురళీకృష్ణ (39) ఈ నెల 25న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతన్ని తొలుత తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మురళీకృష్ణ మృతి చెందారు. నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.