పెదవేగి మండలం రామచంద్రపురంలో బుధవారం రాత్రి, నక్కరాటాలు వరుసకు సోదరుడైన మధుపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో మధుకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై హరి గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడైన మధుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.