ఏలూరు జిల్లాలో జూన్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుండి
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లావ్యాప్తంగా 2.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 113.29 కోట్లను 4,959 మంది సిబ్బంది ద్వారా అందజేయనున్నారు. తొలిరోజే వందశాతం పంపిణీ లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి రెండో తేదీన పింఛన్లు అందజేస్తారు.