ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని స్థాయిల్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా లేదా 1100 టోల్‌ఫ్రీ నంబర్, meekosam.ap.gov.in ద్వారా విన్నవించుకోవచ్చని సూచించారు. అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.