ఆర్టీసీ సిబ్బంది చాకచక్యంతో ఫోన్ స్నాచర్ అరెస్ట్

526చూసినవారు
ఆర్టీసీ సిబ్బంది చాకచక్యంతో ఫోన్ స్నాచర్ అరెస్ట్
గురువారం తెల్లవారుజామున ఏలూరు కొత్త బస్టాండ్‌లో ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని ఆర్టీసీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. 2వ ప్లాట్‌ఫారమ్ వద్ద దుగ్గి భాగ్యం అనే ప్రయాణికురాలిపై పెదపూడి సాయి దాడి చేసి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా, ఆమె కళ్లజోడు విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ ఎం. ఫణి కుమార్, కంట్రోలర్ కె.ఎ. రావు నిందితుడిని పట్టుకున్నారు. III-టౌన్ పోలీసులు నిందితుడిని తనిఖీ చేయగా అతని వద్ద కత్తి, గంజాయి లభించాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్