టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంలో గుంట నక్కలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన బుజ్జిబాబు పామాయిల్ తోటలో రెండు గుంట నక్కలు సంచరిస్తుండగా, కౌలు రైతు పల్లా రమేశ్ శుక్రవారం ఉదయం వీడియో తీశారు. గత పది రోజులుగా ఇవి తోటలోనే ఆవాసం ఉంటున్నాయని, అంతరించిపోతున్న ఈ జీవులు ఇలా కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.