ఏలూరులో చలివేంద్రాలపై పొలిటికల్ హీట్

485చూసినవారు
ఏలూరులో చలివేంద్రాలపై పొలిటికల్ హీట్
ఏలూరులో ఏర్పాటు చేసిన చలివేంద్రాల విషయంలో ఎమ్మెల్యే బడేటి చంటి, వైసీపీ ఇన్‌ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాశ్ మధ్య వివాదం మొదలైంది. 82 చలివేంద్రాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని చంటి ఆరోపించారు. దీనికి ప్రతిస్పందిస్తూ, జనసంచారం ఉన్న చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలకు తెలియకపోవడం విడ్డూరమని, నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగిస్తే సిద్ధమని జయప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంతో ఏలూరు రాజకీయాలు వేడెక్కాయి.

సంబంధిత పోస్ట్