జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరగనున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరులో సమావేశాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా జూన్ 3న వేలాది మంది రైతులతో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామని, మూడు రోజుల పాటు 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.