జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు అధ్వర్యంలో భీమవరంలోని రోటరీ క్లబ్ లో జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భీమవరంకు చెందిన దళిత నాయకులు ఈది రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైయ్యారు. నూతనంగా ఎన్నికైన రాజశేఖర్ ను పలువురు అభినందించారు. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, వివక్షకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దళిత మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.