జులై 11న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై ఏలూరు జిల్లా కోర్టులో మొదటి అదనపు జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని పోలీసు అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రాజకీయపరమైన, క్రిమినల్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.