ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ఏలూరు జిల్లా వాసి మృతి

4చూసినవారు
ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ఏలూరు జిల్లా వాసి మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఏలూరు, కృష్ణా జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ (32), నవీన్ (30)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.