ఏలూరు ఆర్.ఆర్.పేట పాములదిబ్బలో జరుగుతున్న బాల్య వివాహంపై సమాచారం అందడంతో, మంగళవారం శక్తి టీం సభ్యులు అప్రమత్తమై ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఏలూరు మహిళా సీఐ సుబ్బారావు నేతృత్వంలో అధికారుల బృందం పాల్గొంది. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, బాలికల విద్య మరియు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేస్తూ, బాలికల భవిష్యత్తు కోసం వారిని చదివించాలని సూచించారు.