మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో, ఏలూరు జిల్లా ప్రజలకు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం ఒక విజ్ఞప్తి చేశారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.