వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

124చూసినవారు
వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం
ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, జగన్నాథపురంలో స్వయంభువుగా కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మూడోరోజు జరిగిన ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు, అక్షింతల కోసం పోటీపడ్డారు. గోపాలపురం, ద్వారకా తిరుమల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్