ఏలూరు జిల్లాలో అక్షరాస్యత పెరుగుదలకు చర్యలు తీసుకోవాలి

308చూసినవారు
ఏలూరు జిల్లాలో అక్షరాస్యత పెరుగుదలకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో అక్షరాస్యతను పెంచేందుకు 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆమె, జిల్లాలోని 97,200 మందికి అక్షరాస్యత, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత అందించడమే లక్ష్యమని తెలిపారు. అభ్యాసకుల వివరాలను సంబంధిత సచివాలయ సిబ్బంది శనివారం నాటికి యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్