ఏలూరు ఆశ్రం కళాశాలలో పారా మెడికల్ టెక్నికల్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్న కమ్మెల సన్ని (23) అనే విద్యార్థి, నిమ్మకాయల యార్డు సమీప రైల్వే గేటు పక్కనే శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పెద వేగి మండలం కె. కన్నాపురానికి చెందిన సన్ని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.