ఏలూరు టూ టౌన్ పరిధిలోని చాణక్యపురి కాలనీలో 15 రోజుల క్రితమే అద్దెకు వచ్చిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు ఆమె నోటి వెంట నురగలు కక్కుతూ మరణించి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నెల రోజుల క్రితం పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నామని చెప్పి దంపతులుగా అద్దెకు వచ్చారని, ప్రస్తుతం వారి వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.