కుర్చీలు ఖాళీ

290చూసినవారు
కుర్చీలు ఖాళీ
గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పాలన గడువు నేటితో ముగుస్తోంది. రేపటి నుంచి గ్రామ పంచాయతీల పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. పంచా యతీల్లో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు ఏర్పాట య్యే వరకు ప్రత్యేకాధికారుల పాలనే జరుగు తుంది. జిల్లాలో 546 పంచాయతీలు ఉండగా ఎంపీ డీవో, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, సివి ల్‌సప్లయీస్‌ డీటీ, డిప్యూటీ ఎంపీడీవో, ఈవోఆర్డీ, ఎంఈవో, వ్యవ సాయ, ఉద్యాన, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖాధి కారులను, ఇంజనీరింగ్‌ శాఖాధికారులను ప్రత్యేకాధి కారులు/ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా నియ మిస్తూ కలెక్టర్‌ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రెండు నుంచి మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. మండలం ప్రాతిపదికగా వీరిని నియమించారు. వీరంతా రేపు అయా పంచాయతీ ల్లో బాధ్యతలు చేపడతారు. గ్రామాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలు, 15వ ఆర్థిక సంఘ నిధుల నిర్వహణ, సాధారణ పాలనా నిర్వహణ, పంచా యతీలకు సంబంధించి సాధారణ పనుల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అత్యవసర పనులకే ప్రాధాన్యం ఇస్తారు. ఎటువంటి రాజకీయా లకు తావు ఇవ్వకుండా పాలన నిర్వహించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్