కన్నాపురంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తూర్పు కాలువ
మొంథా వాయుగుండం ప్రభావంతో కొయ్యలగూడెంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీనితో కన్నాపురం వద్ద తూర్పు కాలువ ఉద్ధృతంగా ప్రవహించి, పోలవరం వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలను నిలిపివేసింది. అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు వెంటనే రెవెన్యూ సిబ్బందిని రంగంలోకి దించి, కాలువకు ఇరువైపులా గస్తీ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.