కోరుకొల్లుకు చెందిన గూడూరి జ్యోతి స్వరూప్ అనే యువకుడు ఈ నెల 24న తెల్లవారుజామున ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తండ్రి వెంకట గంగాధర వరప్రసాద్ ఫిర్యాదు మేరకు కలిదిండి ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసినట్లు ఆదివారం తెలిపారు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.