రైతు ఇంట్లో దొంగతనం.. 5 కాసుల బంగారం, వెండి, నగదు మాయం

1168చూసినవారు
రైతు ఇంట్లో దొంగతనం.. 5 కాసుల బంగారం, వెండి, నగదు మాయం
కొత్తగూడెంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రైతు చల్లగుండ్ల చక్రధరరావు తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి 5 కాసుల బంగారు నగలు, 150 గ్రాముల వెండి, నగదును దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్