ఏలూరులో మంగళవారం సత్రంపాడు ప్రాంతంలో గంజాయి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈగల్ టీం మరియు 3 టౌన్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7 చిన్న గంజాయి ప్యాకెట్లు, సుమారు 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. గంజాయి లేదా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ 1972 కు తెలియజేయాలని ఈగల్ టీం అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.