వైద్యం అందక గిరిజన బాలిక మృతి

0చూసినవారు
వైద్యం అందక గిరిజన బాలిక మృతి
బుట్టాయగూడెం మండలం మోతుగూడెంకు చెందిన గోగుల శ్రీరిత్విక (4) అనే బాలిక జ్వరంతో సోమవారం మృతి చెందింది. ఆర్.ఎం.పి వైద్యం చేసినా జ్వరం తగ్గకపోవడంతో, తల్లిదండ్రులు బాలికను మొదట బుట్టాయగూడెం సీహెచ్సీకి, ఆపై జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే బాలిక మృతి చెందింది.

సంబంధిత పోస్ట్