జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఇద్దరు మృతి

3చూసినవారు
జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఇద్దరు మృతి
గురువారం పెదవేగి మండలం భోగాపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి అన్నవరం వెళ్తున్న 11 మంది ప్రయాణికుల వాహనం పంక్చర్ కావడంతో, టైరు మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రామాంజనేయులు (36), మెహబూబున్నిసా (25) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ప్రయాణికులు డివైడర్‌పై నిలబడటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్