ఉంగుటూరు: మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య

1541చూసినవారు
ఉంగుటూరు: మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య
తేనీరు పెట్టలేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన అనూష (22) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నారు. వెల్లమిల్లి పంచాయతీ చింతాయిగూడేనికి చెందిన ఈ ఘటనలో, తల్లి కోరగా తేనీరు పెట్టనని మొండికేసిన అనూష, మందలింపుతో అలిగి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా పంకాకు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్