ఉంగుటూరు మండలం తిమ్మయ్య పాలెం గ్రామ మాజీ సర్పంచ్ మారిశెట్టి సత్యనారాయణ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన 2001 నుంచి 2006 వరకు సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. సత్యనారాయణ భౌతికకాయానికి ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఏఎంసీ ఛైర్మన్ సూరత్తుల జ్యోతి అయ్యప్ప, మాజీ ఏఎంసీ ఛైర్మన్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.