వేంసూరు మండలం దుద్దేపూడి వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాగం పద్మావతి (45) అనే మహిళ మృతి చెందారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడేనికి చెందిన పద్మావతి, ఆమె భర్త భాస్కర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పద్మావతిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఆమె భర్త భాస్కర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.