ఏలూరు రూరల్ మండలం మాధవపురంలో గండికోట వెంకన్న (30) అనే యువకుడు తల్లి మందలించడంతో మనస్తాపం చెంది జూన్ 25న వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.