జగ్గంపేట మండలం బావవరం వద్ద ఏలేరు ప్రాజెక్ట్‌లో ఒక యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. గండేపల్లి మండలం సూరంపాలెంకు చెందిన డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న 14 మంది యువకులు విహారయాత్రకు వచ్చారు. వారిలో నలుగురు స్నానానికి దిగగా, తాళ్లరేవు మండలం పటవలకు చెందిన వడ్డి ప్రశాంత్ (19) గల్లంతయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.