
రాజమండ్రిలో స్వచ్ఛభారత్: కాలనీవాసులు ప్రతిజ్ఞ
రాజమండ్రి నగరం పదవ వార్డు ఆర్టీసీ కాలనీలో బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. కాలనీవాసులు మున్సిపల్ సిబ్బందితో కలిసి సమశ్యాత్మక ప్రదేశాలు, వీధుల సెంటర్లలో శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేసి సిబ్బందికి అందజేసి నగర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.


































