దేవరపల్లి: భార్యపై భర్త కత్తితో దాడి

60చూసినవారు
దేవరపల్లి: భార్యపై భర్త కత్తితో దాడి
దేవరపల్లి మండలం గౌరిపట్నం పంచాయితీ కొండగూడెం 15వ వీధిలో రాపాక నాగార్జున(38) భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల భార్య మీద అనుమానంతో ఫోన్ వాడొద్దని చెప్పిన మాట వినకపోవడంతో తీవ్ర అసహనానికి గురై భార్యపై కత్తితో దాడి చేశాడు. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దేవరపల్లి పోలీసులు సీఐ, ఎస్సైలు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్