గోపాలపురం - Gopalapuram

సాలివేణు పుట్టినరోజు వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు

సాలివేణు పుట్టినరోజు వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలివేణు పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్నగూడెం సర్పంచ్ బొంత భరత్ బాబు, ఎంపీటీసీ బొంత చినబాబు, గోపాలపురం ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జెడ్పిటిసి కాకులపాటి లలిత, గోపాలపురం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకులపాటి శ్రీను, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి సుధీర్ కుమార్, దేవరపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుదే రాజు, వార్డు సభ్యులు గాడి పెద్దిరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా