
దుద్దుకూరులో ఉచితంగా డెడ్ బాడీ ప్రిజర్ బాక్స్ అందజేత
దేవరపల్లి మండలం దుద్దుకూరులోని ఎస్సీ పేటలో మృతదేహాల సంరక్షణ కోసం డెడ్ బాడీ ప్రిజర్ బాక్సును ఉచితంగా అందజేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఏజీఎం రాపాక సుబ్బారావు తెలిపారు. ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రిజర్ బాక్స్ ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా మృతదేహాలను భద్రపరచడంలో సహాయపడుతుందని వివరించారు.





































