
రాజానగరం NH పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే ఆదేశం
రాజానగరం నియోజకవర్గ పరిధిలోని NH పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. నేషనల్ హైవే అధికారులతో సమావేశమై, దివాన్ చెరువు ఫ్లై ఓవర్ పనుల పురోగతిని సమీక్షించారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, 216 హైవేలో దివాన్ చెరువు నుంచి రాజమండ్రి వరకు సెంట్రల్ లైటింగ్ ప్రతిపాదించాలని సూచించారు.





































