
కైకలూరు: తుఫాన్ ముందస్తు చర్యలకు రంగం సిద్ధం
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కైకలూరు-కలిదిండి మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న లాల్వా వంతెనను పరిశీలించి, ప్రజలకు, పోలీసు అధికారులకు తుపాను భద్రతా సూచనలు అందించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత శిబిరాలకు తరలివెళ్లాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.


































