విద్యార్థులకు పూర్వ విద్యార్థుల డైరీల పంపిణీ

547చూసినవారు
విద్యార్థులకు పూర్వ విద్యార్థుల డైరీల పంపిణీ
ముదినేపల్లి మండలంలోని వడాలి జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పదో తరగతి పూర్వ విద్యార్థులు డైరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి వీరమల్లు నరసింహారావు మాట్లాడుతూ, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మంచి గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ఉచిత బోధనతో పాటు యూనిఫామ్, పుస్తకాలు, తల్లికి వందనం పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్