కైకలూరు మండలం వరాహపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం 12 మంది లబ్ధిదారులకు రూ. 6, 57, 098 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అందజేశారు. వైద్యం చేయించుకోలేని వారికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తుందని, పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.