ముదినేపల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

2032చూసినవారు
ముదినేపల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోమర్రుకు చెందిన మోహన్ సాయి ముదినేపల్లికి బైకుపై వెళ్తుండగా, కనకదుర్గాదేవి ఆలయం వద్ద బంటుమిల్లి నుంచి వస్తున్న బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్ సాయి కాలికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్