ఉత్తమ ఆక్వా రైతు అవార్డుతో రుద్రరాజు యువరాజు సత్కారం

233చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం కలిగొట్లకు చెందిన ప్రముఖ ఆక్వా రైతు, MPTC రుద్రరాజు యువరాజుకు భీమవరంలో శుక్రవారం జరిగిన ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్స్పోలో ఉత్తమ ఆక్వా రైతు అవార్డు లభించింది. RRR చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న యువరాజు, ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ఆక్వా పరిశ్రమకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మానవత సంస్థ నాయకులు వినాయక్, కేటీన్, డాక్టర్ గాదిరాజు రంగరాజు, దంగేటి రామలింగేశ్వరరావు, నాగబాబు తదితరులు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్