
నరసాపురం: వైసీపీ నుండి జనసేనలోకి భారీగా చేరికలు
నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం కాళీపట్నం పడమరకు చెందిన కవురు ఆది నారాయణ తన అనుచరులతో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ, జనసేనపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.





































