పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి గ్రామంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం సుప్రభాత సేవ అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహించారు. అలంకరణ తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.