మొగల్తూరులో ప్రధాన పంట అయిన మామిడి తోటల్లో ఈ ఏడాది పూత అధికంగా పూయడంతో దిగుబడి బాగా వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. గత కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు కురవడం వల్ల పూత రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా పూసిన మామిడి పూత రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.