ప్రభుత్వం తక్షణమే 396 జివో ను రద్దు చేయాలి: దస్తవేజు లేఖరులు

4చూసినవారు
ప్రభుత్వం తీసుకువచ్చిన 396 జివో ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మొగల్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు సోమవారం టెంట్ వేసి నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల ఆస్తికి భద్రత లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దస్తావేజులేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని లేఖర్లు, స్టాంపు వండర్లు, డిటిపి ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతీయొద్దని అన్నారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు 6, 7 తేదీలలో పెన్డౌన్ కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్