పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ నుండి భీమవరం మండలం వరకు 42 కిలోమీటర్లు విస్తరించి ఉన్న జాతీయ రహదారి ప్రక్కన విచ్చలవిడిగా భారీ వాహనాలు నిలిపిన చేయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్, రవాణాశాఖ అధికారులు వాహనాల అక్రమ పార్కింగ్ ను అరికట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.