న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి.. బార్ అసోసియేషన్

5చూసినవారు
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి..  బార్ అసోసియేషన్
నరసాపురంలో నర్సాపురం బార్ అసోసియేషన్ మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ముందు శుక్రవారం నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే ఈ చట్టం అమలులో ఉందని, అదే తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని వారు కోరారు. ఈ నిరసనలో IAL రాష్ట్ర నాయకులు నెక్కంటి క్రాంతికుమార్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్