నరసాపురం: మార్చి 13న లోక్ అదాలత్

189చూసినవారు
నరసాపురం: మార్చి 13న లోక్ అదాలత్
మార్చి 13న నరసాపురం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. ఈ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, న్యాయవాదులు, పోలీసు అధికారులు సహకరించాలని ఆమె సూచించారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద బీమాకు సంబంధించిన కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలు ఈ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్